కంపెనీ సీఈవోగా రానా… - MicTv.in - Telugu News
mictv telugu

కంపెనీ సీఈవోగా రానా…

September 2, 2017

 

ప్రస్తుతం యువత ఎక్కువగా సోషల్ మీడియానే ఫాలో అవుతుండంతో డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ ల హవా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రానా హోస్ట్ గా చేస్తున్న ‘నబర్ వన్ యారి’ విత్ రానా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న వియూ సంస్థ నిర్మాతలు.. ‘సోషల్ ‘పేరుతో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో రానా నటిస్తున్నారు. నవీన్ కస్తూరియా  ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటోందఅన్న విషయాలను చూపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా థ్రిలింగ్ గా ఉండగా , రానా ఇందులో ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న సోషల్ కంపెనీ సీఈవో విక్రమ్ సంపత్ గా కనిపిస్తున్నాడు. “ఎ క్లిక్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్” అనే ట్యాగ్ లైన్ తో ఈ వెబ్ సిరీస్ రూపోందుతోంది. ఈ నెలలో  8న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ యువత సమస్యలను ఎంతవరకు పరిష్కరిస్తుందో తెలియాలి మరి.