చిట్టిబాబు చిందేశాడంటే... - MicTv.in - Telugu News
mictv telugu

చిట్టిబాబు చిందేశాడంటే…

December 9, 2017

‘చిట్టిబాబు’ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ చిత్రం ద్వారా కనువిందు చేయనున్నాడు. ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్స్ నుండి ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తున్నది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.

లుంగీ కట్టుకున్న చెర్రీ మాస్ గెటప్‌లో పాత లుక్‌లో కనిపిస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్నది. ఆది పినిశెట్టి, జబర్దస్త్ అనసూయలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా 30 మార్చి 2018 న విడుదలకు సిద్ధమవుతున్నది.