ఫేస్‌బుక్ పోస్ట్.. తలలు పగలగొట్టుకున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ పోస్ట్.. తలలు పగలగొట్టుకున్నారు..

April 17, 2018

కొన్నిసార్లు  చిన్నచిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ కామెంట్ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండలం బడెంపల్లి జరిగింది. గ్రామానికి చెందిన నీరటి శ్రీనివాస్ ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో యాదవులు పులులు అని పేర్కొంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు వేరే వర్గానికి చెందిన మక్త నరేష్ ‘బొంగు ఏమి కాదు’ అని కామెంట్ పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగింది. పెద్దలు సర్థి చెప్పారు. తర్వాత ఆదివారం రాత్రి గ్రామంలో జరిగిన విందులోనూ దీనిపై మటామాటా అనుకున్నారు.ఇరువర్గాల వారికి మధ్య ఘర్షణ జరిగింది. దాడిలో ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బడెంపల్లికి వెళ్లి అదుపు చేశారు. మొత్తం 21మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.