తండ్రి రికార్డును బ్రేక్ చేసిన చెర్రీ - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి రికార్డును బ్రేక్ చేసిన చెర్రీ

April 13, 2018

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ విడుదలై  అందరి ప్రశంసలతో విజయవంతంగా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో  చెర్రీ తండ్రి చిరంజీవి నంటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రికార్డును కూడా అధిగమించింది.ఇప్పటివరకు ‘బాహుబలి 2’ ఎక్కువ కలెక్షన్లను వసూల్ చేసిన సినిమాగా రికార్డు ఎక్కింది.  ఆ తరువాత స్థానంలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఉంది. ఇది 164 కోట్లను వసూల్ చేసింది. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘రంగస్థలం’ తొలిరోజునే 128 కోట్లను కొల్లగొట్టేసింది. 13వ రోజు పూర్తయ్యేనాటికి 161 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా, 14వ రోజుకి ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డును అధిగమించిందని సినీ విశ్లేషకులు జీవీ ట్వీట్ చేశారు. తండ్రి  సినిమా రికార్డును తనయుడు అధిగమించడం విశేషం.