దేవిశ్రీ ప్రసాద్  నా ఆశల మీద నీళ్లు చల్లాడు... - MicTv.in - Telugu News
mictv telugu

దేవిశ్రీ ప్రసాద్  నా ఆశల మీద నీళ్లు చల్లాడు…

April 3, 2018

రామ్ చరణ్ కథానాయకుడిగా పల్లెటూరి కథతో వచ్చిన రంగస్థలం విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది. అప్పుడే రూ. 100 కోట్లు వసూలు చేసింది. మరోవైపు ఈ సినిమాకు  అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ జానపద కళాకారుడు శివనాగులు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై చాలా గరం అవుతున్నాడు. ఈ చిత్రంలో ‘ ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా’ అనే పాటను శివనాగులు పాడారు. ఆడియో పంక్షన్‌లో కూడా వేదికపైకి పిలిచి శివనాగులు చేత పాడించారు. దీంతో ఎంతో సంతోషంగా ఉన్న శివనాగులుకు సినిమా విడుదలయ్యాక షాక్ తగిలింది. తెరమీద పాటలో శివనాగులు గొంతుకు బదులు దేవిశ్రీ ప్రసాద్ గొంతు వినించేసరికి శివనాగులు ఒక్కసారిగా శివాలెత్తాడు.శివనాగులు చిన్న చిన్న వేదికలపై పాటలు పాడుతుండేవాడు. ఈ చిత్రం ద్వారా ప్రపంచనానికి తన గొంతు వినిపిస్తుందని ఆశపడ్డానని చెప్పాడు. అయతే  సినిమా విడుదులయ్యాక చూస్తే సినిమాలో తన గొంతు లేదని ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తన గొంతుకు బదులు దేవి గొంతు ఉన్నట్టు ఒక్కమాట తనకు చెప్పి ఉంటే బాగుండేదని  పేర్కొన్నాడు. ఆడియో ఫంక్షన్‌లో మాత్రం దేవి తనపై ప్రశంసలు కురింపించాడని.. పది రోజుల్లోనే తన ఆశలపై నీళ్లు చల్లాడని తెలిపాడు. ఇలాంటి ఘటనలు ఇకపై మరెవ్వరూ ఎదుర్కోకూడదని తాను మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు.