సెల్ ఫోన్ లేని ప్రేమకథ! - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ ఫోన్ లేని ప్రేమకథ!

September 3, 2017

సెల్ ఫోన్ వచ్చాక మనిషి జీవితమే మారిపోయింది. ఆడుతూపాడుతూ ఆటలు అడుకునే పిల్లలుకూడా సెల్ ఫోన్ ను పట్టుకుని విషపు కోరల్లో చిక్కుకుంటున్నారు. పిల్లలే కాదు పెద్దలు సైతం సెల్ ఫోన్ కు బానిసలు అయిపోతున్నారు. అసలు సెల్ ఫోన్ లేకుండా బతకలేమా? సెల్ ఫోన్ లేని రోజల్లో ఎలా ఉన్నారు . కమ్యూనికేషన్ కోసం ఏం చేసేవాళ్లు ముఖ్యంగా ప్రేమికులు తమ సందేశాలను ఎలా పంపుకునేవాళ్లు? ఈ ముచ్చట్లను ఓసారి మనకు గుర్తు చేయనున్నారు డైరెక్టర్ సుకుమార్.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జోడీ “రంగస్థలం” మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా 1985 కాలంలో నడుస్తుంది. ఆ కాలానికి తగట్టుగా మారిపోవడానికి నటీనటులు కూడా ఆస్థాయిలోనే కసరత్తులు చేస్తున్నారు. రామ్ చరణ్ షూటింగ్ జరిగినన్ని రోజులు సెల్ ఫోన్, ఇంటర్నెట్ కు దూరంగా ఉంటున్నాడట.

ఇంకా బ్రాండెడ్ దుస్తులు కూడా వేసుకోవడం లేదట. రంగస్థలం మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతోంది. రామ్ చరణ్ కు సంబంధించిన డ్రస్సులు, క్యాస్టూమ్స్  అక్కడ ఓ చిన్న  వస్త్ర దుకాణంలో తయారువుతున్నాయి.

షూటింగ్ లేని రోజుల్లో కూడా సెల్ ఫోన్, బ్రాండెడ్ వస్తువులు వాడకుండా రామ్ చరణ్ జాగ్రత్తపడుతున్నాడట. ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఓప్రత్యేకమైన వేషధారణలో కనిపించబోతున్నాడు. ఆహర విషయంలో కూడా జాగత్రలు తీసుకుంటున్నాడు. సమంత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఈ మూవీని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మూవీ 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.