రికార్డులు బద్దలు కొడుతున్న రంగస్థలం - MicTv.in - Telugu News
mictv telugu

రికార్డులు బద్దలు కొడుతున్న రంగస్థలం

March 31, 2018

‘ రంగస్థలం ’ సినిమా విజయ దుందుభి మోగిస్తోంది. గ్రామీణ నేప‌థ్యంలో ఈ మూవీని త‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించాడు దర్శకుడు సుకుమార్.  తొలిరోజు రూ.25 లక్షల గ్రాస్ సాధించిన సినిమాగా బాబాయ్ నటించిన ‘ అజ్ఞాతవాసి ’ వుండేది. ఇప్పుడి ఆ రికార్డును దాటేసింది అబ్బయ్ సినిమా. యూఎస్‌లో తొలి రోజే 1 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుద‌లైన ఈ చిత్రం అన్ని చోట్ల మంచి విజయాన్ని కైవసం చేసుకుంది.రామ్ చరణ్ నటన, స‌మంత అంద‌చందాలు, ర‌త్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం భారీ విజ‌యంలో భాగమయ్యాయి. ముందు ముందు ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అంటున్నారు సినీ విశ్లేషకులు. తమిళనాట కూడా ఈ చిత్రం విజ‌యవంతంగా ప్రదర్శించబడుతోంది.