వీర్‌దీప్ వివాహంపై వివాదం… సిక్కుల సాంప్రదాయాన్ని... - MicTv.in - Telugu News
mictv telugu

వీర్‌దీప్ వివాహంపై వివాదం… సిక్కుల సాంప్రదాయాన్ని…

November 20, 2018

ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు బాలీవుడ్ కొత్తజంట దీపికా పడుకొనె, రణ్‌వీర్ సింగ్‌లు. సెలబ్రిటీలు కదా.. వారి ప్రతీ మూమెంట్ మీద ప్రతి ఒక్కరి చూపు వుంటుంది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా నాలుగు వేళ్లు వాళ్ళ వైపు చూపిస్తాయి. అదే జరిగింది ఈ జంట విషయంలో. 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత కొంకణీ సంప్రదాయంలో, 15న సింధీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. అంతా బాగానే జరిగింది. 28న ముంబైలో విందు ఇవ్వటానికి కూడా ఈ జంట ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంతలో ఓ వివాదం వారిని చుట్టుముట్టింది.Telugu news Ranveer Singh-Deepika Padukone wedding: Sikh body upset over Anand Karaj performed outside gurdwaraఇటలీలో జరిగిన పెళ్లి సందర్భంగా నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురుగ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదన్న నిబంధనను వారు ఉల్లంఘించారని సంస్థ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని తెలిపారు. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైన అనంతరం ఐదుగురు అత్యున్నత మత పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు అకల్ తఖ్త్ జతేదార్ తెలిపారు.