రావు రమేష్‌కు మాతృవియోగం - MicTv.in - Telugu News
mictv telugu

రావు రమేష్‌కు మాతృవియోగం

April 7, 2018

దివంగత నటుడు రావుగోపాల రావు సతీమణి కమలా కుమారి (73 ) ఈ ఉదయం కన్ను మూశారు. ప్రముఖ నటుడు రావు రమేష్ ఆమె కుమారుడే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కమలా కుమారి హరికథా కళాకారిణి. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 5వేల వరకు ప్రదర్శనలిచ్చారు.రావు గోపాల రావుది ఆమెది ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. పెద్ద కుమారుడే రావు రమేష్. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి రావు రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కమలా కుమారి పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.