పెళ్లి బృందం ట్రక్కు బోల్తా 20 మంది మృతి..30 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి బృందం ట్రక్కు బోల్తా 20 మంది మృతి..30 మందికి గాయాలు

April 18, 2018

మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు  అమేలియా ప్రాంతంలోని జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్‌ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు.30 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్‌  తెలిపారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం  కింద అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.