అబ్బాయిల టాయిలెట్లో అమ్మాయి... - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బాయిల టాయిలెట్లో అమ్మాయి…

September 11, 2017

హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ రావూస్ పాఠశాలలో దారుణం జరిగింది. స్కూల్ యూనిఫాం వేసకురాలేదనే కారణంలో పదకొండేళ్ల చిన్నారిని టీచర్ అబ్బాయిల టాయిలెట్ లో నిలబెట్టింది. దాంతో మనస్తాపం చెందిన బాలిక ఇంటికి వచ్చి తాను స్కూల్ కు వెళ్లనని తల్లిదండ్రులతో చెప్పింది. తనను స్కూల్ లో యూనిఫాం వేసుకురాలేదని టీచర్ బాయ్స్ మూత్రశాలలో నిలబెట్టిందని తోటి పిల్లలు చూసి నవ్వుతూ ఎగతాళి చేయడంతో మానసిక ఆవేదన చెందినట్టు బాలిక తల్లిదండ్రలకు మొర పెట్టుకుంది.

విషయం గురించి తల్లిదండ్రలు ప్రిన్సిపాల్ ను ప్రశ్నించించగా నిర్లక్ష్య సమాధానం ఎదురైంది. దాంతో విషయం తెలుకున్న చైల్డ్ రైట్స్ యాక్టీవిస్ట్స్ పాఠశాలపై కేసు నమోదు చేసి , చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేయడంతో పాఠశాల యాజమాన్యం దిగివచ్చి టీచర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. పిల్లలను దండించకుండా చదువులు చెప్పాలని ఎందరు చెప్పినా ఇలాంటి కొందరు టీచర్లు మారరా ??