శివశివా.. గుడిలో రేప్..! - MicTv.in - Telugu News
mictv telugu

శివశివా.. గుడిలో రేప్..!

February 6, 2018

నీచానికి ఒడిగట్టే నీచులకు గుడి అయితేనేం?. బడి అయితేనేం ? తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించడమే వారి ప్రధాన కర్తవ్యమని ఈ సంఘటన రుజువు చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలో ఈ దారుణం జరిగింది. ధర్ జిల్లాలోని పాట్లవాడ్‌లో విద్యార్థిని తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లింది. అతడు రాకపోవడంతో పక్కనే వున్న బస్టాప్‌లో ఎదురు చూస్తూ కూర్చుంది.

ఇంతలో అక్కడికొచ్చాడో నీచుడు. లోలోపల పథకం రచించుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘ నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చోవటం అంత మంచిది కాదు.. @గుడిలోకి వెళ్ళి కూర్చో’ అని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆమె గుడిలోకి వెళ్ళింది.

వెంటనే అతడు తన ఇద్దరు #స్నేహితుల్ని లోపలికి వెళ్లమని సైగ చేశాడు. ఆమె అలా వెళ్లగానే గుడి తలుపులు మూసేశారు. ​ బాధితురాలు కేకలు వేసినా వినపడకుండా ఒకరు నోరు మూశారు. గుడి, దేవుడు అన్న ఉచ్ఛనీచాలు లేకుండా ఆమెను గుళ్ళోనే చెరబట్టారు. తరువాత అక్కడి నుంచి పారిపోయారు.

కాసేపటికి తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో బైక్ స్టిక్కర్ నిందితుల్ని పట్టించడంలో కీలకంగా మారింది. ముగ్గురిలో ఒకరి బైక్‌పై సంజు బాబా పేరుతో స్టిక్కర్ అంటించి ఉంది. దీనిని బాధితురాలి గమనించి పోలీసులకు చెప్పడంతో స్థానికంగా ఆరా తీశారు. ఈ క్రమంలో సంజయ్ పటేల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. మిగతా ఇద్దరు నిందితుల పేర్లు కూడా చెప్పడంతో  వారిని కూడా పోలీసులు కటకటాల వెనకకు నెట్టారు.