రేప్ చేశాడని 40 బీపీ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది... - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ చేశాడని 40 బీపీ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది…

March 24, 2018

హైదరాబాద్ మెట్టడూడ ప్రాంతంలో దారుణం జరిగింది. అత్యచార బాధితురాలు(17) బీపీ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. చిలకలగూడ  ఏస్సై ఆర్. బాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం…బాధితురాలు నామాలగుండలోని తన అమ్మమ్మ ఇంటికి గురువారం వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆమె ఇంటిలో సుమారు 40 బీపీ  మాత్రలను మింగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. దాంతో ఆమె తల్లిదండ్రలు కన్నీరు మున్నురుగా విలపిస్తున్నారు.

ఈ నెల 13న సదురు బాలికను మహ్మద్ అస్లాం (22) అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆ యువతి మనస్థానం చెంది  ఆత్మహత్య చేసుకుందని ఏస్సై తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.