ప్రీతికి ఇష్టమైన హీరో ‘అర్జున్ రెడ్డే’ నట..!  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రీతికి ఇష్టమైన హీరో ‘అర్జున్ రెడ్డే’ నట..! 

September 14, 2017

‘అర్జున్ రెడ్డి’ మూవీతో మంచి సక్సెస్  సాంధించిన  నటి షాలిని పాండే . ఓ మెుబైల్ షాపు ప్రారంభానికి నెల్లూరు వెళ్లారు. అక్కడ కొద్దిగా అస్వస్థగా అనిపించి ఆసుపత్రికి వెళ్లింది. ఆ విషయం కాస్త వైరల్ అయింది. నా ఆరోగ్యం బాగానే ఉంది అని ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడింది షాలిని. తనకు, కొంచెం తలనొప్పి, జ్వరంగా ఉండి సాధారణ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాను, ప్రజలకు, కనబడకుండా , మొఖాన్ని కవర్ చేసుకున్నాను.. అంతే తప్ప ఇంకేమి లేదని వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని’ మహానటి లో’ మీరు నటింస్తున్నారా? అని ప్రశ్నించాడు. అవును నటిస్తున్నా … కానీ తన పాత్ర గురించి ఇప్పుడే ఏం చేప్పాలేనని…. ఇంకా కొన్ని సినిమాలకు సంతకం చేశాను అని చెప్పింది  ప్రీతిగా మెప్పించిన షాలిని. ‘100% లవ్’ మూవీ తమిళంలో రీమేక్ కు సంతకం కూడా చేసిందట. అన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పింది. హైదరాబాద్ వచ్చేస్తారా? అని ఓ అభిమాని అడిగితే ..ఇంకా ఏమి డిసైడ్ కాలేదు, ప్రస్తుతానికి తన మకాం  ముంబయిలోనే అని  చెప్పింది. టాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడు ’అర్జున్ రెడ్డి’ గా మెప్పించిన విజయ్ దేవరకొండ అని షాలిని తెలిపింది.