హీరోయిన్లు ప్రత్యేక గీతాలలో నటించడం ఈ మధ్య ట్రెడింగ్ గా మారింది . శ్రియ, తమన్నా, శృతి హాసన్ , కాజల్ ప్రత్యేక సాంగ్స్ లో నటించారు. తాజాగా రాశీ ఖన్నా కూడా ప్రత్యేక గీతంలో నటించబోతుందని టాక్. రవితేజ హీరో గా తెరకెక్కుతున్న”రాజాదిగ్రేట్ “చిత్రంలో రాశీ ఓ ప్రత్యేక పాటలో ఆడిపాడబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రత్యేక గీతం తో పాటూ, అతిథి పాత్రలో కూడా రాశీ కన్ఫించే అవకాశాలున్నాయి. ఈ మూవీలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈమూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రవితేజ తల్లిగా ప్రముఖ నటి రాధిక నటిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు, అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు ‘రాజాది గ్రేట్’ రానుంది.