బూమ్రా ఆటకు రాశీఖన్నా ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

బూమ్రా ఆటకు రాశీఖన్నా ఫిదా

February 8, 2018

భారత్ యువ క్రికెటర్ బూమ్రా బౌలింగ్ మాయకు ఏవరైనా పడిపోవాల్సిందే. అందాల భామ రాశీఖన్నా కూడా పడిపోయింది. హీరోయిన్ రాశీఖన్నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకు బూమ్రా  ఆట అంటే చాలా ఇష్టమని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా చూస్తాను. ఏ ఒక్క మ్యాచ్‌ను కూడా మిస్సవ్వను. ఎందుకో తెలుసా  నాకు బూమ్రా అంటే చాలా ఇష్టం. నేను అతనికి వీరాభిమానిని. కేవలం  అతని కోసమే మ్యాచ్‌లు చూస్తాను. ఒక్కోసారి రాత్రి సమయంలో మ్యాచ్‌లు ఉంటే కూడా చూస్తాను’అంటూ నవ్వుతూ చెప్పింది .గతంలో కూడా రాశీఖన్నా, బూమ్రా బౌలింగ్ గురించి సోషల్ మీడియాలో చాలా సార్లు పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజా ప్రశంసల నేపథ్యంలో ఆమె బూమ్రా ప్రేమ వలలో చిక్కకుందని జనం చెవులు కొరుక్కుంటున్నారు. బాలీవుడ్ భామలు పలువురు క్రికెటర్లయిన విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను ప్రేమించి పెళ్లాడ్డం తెలిసిందే. రాశీ కూడా వారి బాట పడుతున్నట్లు కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. కాగా, రాశీ వరుణ్ తేజ్‌తో జంటగా నటించిన ‘తొలిప్రేమ’ పిబ్రవరి 10న విడుదల కానుంది.