చట్నీలో ఎలుక శవం… ఓ టిఫిన్ సెంటర్ నిర్వాకం… - MicTv.in - Telugu News
mictv telugu

చట్నీలో ఎలుక శవం… ఓ టిఫిన్ సెంటర్ నిర్వాకం…

October 5, 2018

బయట ఆహారం అస్సలు తీసుకోవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తే పట్టించుకోరు. కానీ ఇది తెలిస్తే బయట ఏం తినాలన్నా జంకాల్సిందే. ఓ టిఫిన్ సెంటర్లో పార్శిల్ తీసుకువెళ్ళిన దోశలోని చెట్నీలో ఎలుక కళేబరం వచ్చింది. టిఫిన్ తిందామనుకున్న అతని కంటికి ఎలుక కళేబరం కనబడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతడు. విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న మీనా ఇడ్లీ సెంటర్లో వెలుగుచూసింది ఈ దృశ్యం.

Rat corpus in chutney ... a tiffin center manned …

ఓ కష్టమర్ ఇంటికి దోశ పార్శిల్ తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్లి పొట్లం విప్పి చూడగా చట్నీలో ఎలుక కళేబరం కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని టిఫిన్ సెంటర్‌కు వచ్చి టిఫిన్ సెంటర్ యజమానిని నిలదీశాడు. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా టిఫిన్ సెంటర్ మీదకు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు వచ్చి టిఫిన్ సెంటర్‌ను మూసి వేయించారు. ప్రజారోగ్యంతో ఇలా ఆడుకోవడం సరైన పద్థతి కాదని స్థానికులు అంటున్నారు. కాగా టిఫిన్ సెంటర్ యజమాని అది అనుకోకుండా జరిగిందని చెబుతున్నాడు.