mictv telugu

రైలులో ఎలుకలు.. ప్రయాణికుల లొల్లి

February 13, 2019

రైలు ఏసీ బోగీలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేస్తారు. కానీ, అదంతా భ్రమేనని, అక్కడా సాధారణ బోగీల్లో తరహాలోనే అసౌకర్యాలే ఉంటాయని వెల్లడైంది. రైల్వే బోర్డులో ప్రయాణికుల సేవల కమిటీ సభ్యుడు వెంకటరమణి సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లను పరిశీలించినప్పుడు ఈ లోపాలన్నీ వెలుగుచూశాయి.

Telugu news rats are in duronto and garib rath train coaches .....

తనిఖీల్లో భాగంగా ఆయన దురంతో, గరీబ్‌రథ్‌, మరికొన్ని రైళ్లలోని ప్రయాణికులతో మాట్లాడగా పలువురు సమస్యలను ఏకరవు పెట్టారు. ‘ఇతర రైళ్లకంటే దురంతోలో ఛార్జీలు అధికం. ఏసీ బోగీల్లో ఎలుకలు తిరుగుతున్నాయి. విశాఖ నుంచి వచ్చే సమయంలో విజయవాడ తర్వాత బోగీల్లో నీళ్లు ఉండవు’ అని రత్నకుమారి, మరో ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ‘ఏసీ బోగీల్లోని మరుగుదొడ్లలో టిష్యూ పేపర్లు, చేతులు శుభ్రం చేసుకునే రసాయనాలు లేవు’ అని కొందరు, ఏసీ బోగీల్లో ఎలుకలు తిరుగుతున్నాయని మరికొందరు వాపోయారు.Telugu news rats are in duronto and garib rath train coaches