ఎలుకలు మందుకొట్టాయంట.. పోలీసులు చెప్పారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుకలు మందుకొట్టాయంట.. పోలీసులు చెప్పారు..

October 2, 2018

ఒక పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగింది. ఏం పోయింది? మద్యం పోయింది.. ఎవరు? తాగారు? ఎలుకలు తాగాయి… నిజ్జం బాబూ.. నమ్మండి, అమ్మతోడు అంటున్నారు బిహార్ పోలీసులు. తాము స్వాధీనం చేసుకుని ‘భద్రంగా’ దాచిపెట్టిన మందు సీసాలను మూషికాలు ఖాళీ చేశాయని అంటున్నారు. కైమూర్ జిల్లాలో జరిగిందీ విడ్డూరం.

Rats Drink Seized Alcohol In Bihar Police Station.

తనిఖీల్లో భాగంగా పోలీసులు 11,584 మద్యం బాటిళ్లను సీజ్ చేసి స్టోర్ రూంలో దాచిపెట్టారు. తాజాగా సీజ్ చేసిన ఆ మద్యం బాటిళ్లను ధ్వంసం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో సోమవారం అధికారులు స్టోర్ రూమ్ తెరిచి చూడటంతో మద్యం సీసాలు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇది చూసిన అధికారులు కంగుతిన్నారు. బీర్ బాటిళ్లన్నీ అన్ని ఎలుకలే పగులగొట్టాయని, బాక్సుల్లోని బాటిళ్ల మూతలన్నీ పెద్ద రంధ్రాలు పడున్నాయని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కుమారి అనుపమ పేర్కొన్నారు.

గతంలో కూడా ఇలాగే బాటిళ్లలో మద్యాన్ని ఎలుకలే ఖాళీ చేసినట్లు అధికారులు వెల్లడించడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘బాటిళ్లలోని మద్యం ఎలుకలు ఖాళీ చేస్తున్నాయా? లేక పోలీసులే ఖాళీ చేసి, ఎలుకల పేరు చెబుతున్నారా ’అంటూ జనం వేలెత్తి చూపుతున్నారు.