త్వరలో రూ. 350 నాణేలు.. రూ. 10 నాణేనికే దిక్కులేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో రూ. 350 నాణేలు.. రూ. 10 నాణేనికే దిక్కులేదు..

March 27, 2018

భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.350 నాణేన్ని తీసుకురానుంది.  సిక్కుల మతగురువు శ్రీ గురుగోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నాణేన్ని విడుదల చేయనుంది.  పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద నాణేలను తీసుకువస్తోంది.

రూ.350 నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో, వెండి, రాగి, నికెల్, జింక్ తదితర లోహాలతో తయారవుతోంది.  ముందు భాగంలో అశోక స్తంభం, మధ్యలో “సత్యమేవ జయతే” వాక్యాన్ని పొందుపర్చగా, ఎడమవైపున దేవనాగరి లిపిలో “భారత్”, వెనుక భాగంలో ఇండియా అని ఆంగ్లంలో ఉంటుంది.

అలాగే నాణెం వెనుక దేవనాగరి లిపిలోని “శ్రీ గురుగోబింద్ సింగ్‌జీ 350వ ప్రకాశ ఉత్సవ్‌’’ అని కాయిన్‌కి పైభాగాన, దిగువన ఆంగ్లంలో “తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ -1666-2016” చిత్రాన్ని అమర్చినట్టు తెలుస్తోంది. నాణెం బరువు సుమారు 35.35 గ్రాములు ఉంటుంది. ఈ నాణేం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆర్‌బీఐ చెప్పలేదు. ఈ నాణెంపై అప్పుడే విమర్శలు వస్తున్నాయి. రూ. 10 నాణేన్ని తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారని జనం వాపోతున్న సంగతి తెలిసిందే. ఇక రూ. 350ను ఎలా తీసుకుంటారని, ఈ నాణేలకు బదులు రూ. 50, రూ. 20 వంటి చిల్లర నోట్లనే పెద్ద సంఖ్యలో తీసుకురావాలని కోరుతున్నారు.