mictv telugu

ఇకపై ఆన్‌లైన్ పేమెంట్స్‌లో కార్డు, సీవీవీ నంబర్లు చెప్పక్కర్లేదు

January 11, 2019

 మనం ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలంటే అక్కడ రెండు పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్ పేమెంట్ కాగా మరొకటి క్యాష్ ఆన్ డెలివరీ. అలాంటి సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలా? లేక కార్డుతో పేమెంట్ చేయాలా అన్న డైలమా ఉంటుంది. కార్డు వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే సేఫ్ కాదన్న భయం చాలామందిలో ఉంటుంది. అందుకే ఎక్కువ మంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకుంటారు. అయితే కొన్ని వెబ్‌సైట్లు మాత్రం అసలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టవు. దీంతో అసలు సమస్య వస్తుంది. ఇకపై ఈ భయాలు అక్కర్లేదు. మీరు దర్జాగా కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అది కూడా మీ కార్డు నెంబర్, సీవీవీ లాంటి వివరాలేవీ చెప్పకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

Telugu News RBI's new move to make card payments safer .

కార్డు వినియోగదారుల్లో ఉన్న భయాలను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల కోసం కొత్త నియమ నిబంధనలను రూపొందించింది. ‘టోకెనైజేషన్’ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇందులో యూజర్ ప్రత్యామ్నాయంగా ఓ యూనిక్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతీ క్రెడిట్, డెబిట్ కార్డుకు 16 అంకెల టోకెన్ కోడ్ వస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల దగ్గర ఈ యూనిక్ కోడ్ టైప్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ పూర్తవుతుంది. ఇక మీరు మీ కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీ కార్డు వివరాలు వెబ్‌సైట్‌లోకి వెళ్తాయన్న భయం కూడా లేదు. కార్డు డేటా స్కిమ్మింగ్, మోసపూరిత లావాదేవీలకు అవకాశం ఉండదు.

Telugu News RBI's new move to make card payments safer: All you need to know about tokenization