అనిల్ అంబానీకి షాక్…

బడా పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి షాక్ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్)  క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు మూడీస్ శుక్రవారం ప్రకటించింది. తమ బ్రాండ్లపై వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఈ సంస్థ విఫలం చెందిందనే కారణంతో మూడీస్ క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసుకుంది. కొన్ని డిబెంచర్లపై ఈ సంస్థ వడ్డీలు చెల్లించలేకపోతోంది.

సమయానికి వడ్డీలను చెల్లించలేకపోతోందని, అందుకే రేటింగ్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు మూడీస్ సంస్థ తెలిపింది. సరైన సమయంలో వడ్డీలు చెల్లించపోవడానికి మూడీస్ డీఫాల్ట్‌గా పరిగణంలోకి తీసుకుంటుంది.

మార్చి వరకు ఆర్‌కామ్ అప్పు రూ. 44,300 కోట్లు ఉంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న అ సంస్థ  వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ భారీ నష్టాలను నమోదు చేసింది. అనిల్ సోదరుడైన ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌ జియో పేరుతో టెలికం మార్కెట్‌లోకి ప్రవేశించడంతో ఆర్‌కామ్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. జియో నుంచి వస్తున్న తీవ్రమైన చవక ధరల యుద్ధాన్ని ఈ సంస్థ తట్టుకోలేకపోతుంది.

SHARE