చర్యకు ప్రతిచర్య తప్పదు.. నితిన్ - MicTv.in - Telugu News
mictv telugu

చర్యకు ప్రతిచర్య తప్పదు.. నితిన్

April 17, 2018

నటి శ్రీరెడ్డి పవన్‌పై అన్న వ్యాఖ్యలపై హీరో నితిన్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు. బంతిని పైకి విసిరితే అది మళ్ళీ వచ్చి నేలను ఢీకొనే న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టాడు. ‘ చర్యకు ప్రతిచర్య తప్పక వుంటుంది. దాని కోసం వేచి చూడాలి ’ అని పేర్కొన్నాడు. శ్రీరెడ్డి పవన్‌ను అనటంతో చాలా మంది  నటులు, హీరోలు ఆమెకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి రెండు నెలల నుంచి మొత్తుకుంటుంటే ఈ హీరోలందరూ ఎక్కడ దాక్కున్నారు ? ఇప్పుడు పవన్‌ను అనగానే పెద్ద పొడుచుకొచ్చిందని.. శ్రీరెడ్డి తరుపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.