mictv telugu

తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠకు కారణమిదే.. ఆలోచింపజేసే విశ్లేషణ

December 6, 2018

ఏ ఇద్దరు తెలుగు వారు ఎక్కడ కలుసుకున్నా వినబడుతున్న మాట.. ‘ఎవరు గెలుస్తారు? ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతోంది?’ అనే.

ఎన్నికలంటే సహజంగానే ఎవరు  గెలుస్తారు? ఎట్లా గెలుస్తారనే దానిపై చర్చ ఉంటుంది. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు ఈ సహజ చర్చ కాకుండా తీవ్ర స్థాయి చర్చకు తీసుకెళ్లుతున్నాయి. మరింత టెంపో ఎందుకొచ్చింది? అందరి కంటే ముందే సర్వేలు చేయించుకున్న తర్వాతనే  అసెంబ్లీ  రద్దు చేసి కేసీఆర్ ఎన్నకలకు వెళ్లారు కదా.  అప్పుడంతా అనకూలమే అన్నారు కదా? మరిప్పుడెందుకు ఇలా జరుగుతోంది?

rr

దీనికి కొన్ని కారణాలున్నాయి. అసెంబ్లీ రద్దయిన తర్వాత నెల రోజుల వరకు వార్ అంతా వన్ సైడ్ అనుకున్నారు. అప్పుడు పరిస్థితికూడా అలాగే ఉంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కొత్త రకమైన చర్చలు తెరపైకి వచ్చాయి. అందులో  మూడు ముఖ్యమైన అంశాలు:

  1. సోషల్ మీడియా ప్రధానమైనది
  2. ప్రధాన మీడియాలో వచ్చిన కథనాలు
  3. చివరి వారంలో గందర గోళ పర్చిన సర్వేలు

మొదటి అంశం.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ సోషల్ మీడియా చాలా యాక్టీ రోల్ ప్లే  చేసింది. ఎప్పటెప్పటి వీడియోలో బయటకొచ్చాయి. ఎన్నికల ప్రచారంలో  కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు, నాలుగేండ్ల కాలంలో జరిగిన వివిధ అంశాలకు సంబంధించిన వీడియోలు పదే పదే పోస్టులు పెట్టారు.  ఃఇవన్నీ మొబైల్ ఫొన్లలో చక్కర్లు కొట్టాయి. సహజంగానే పాపులర్ పర్సన్స్ వీడియోలే ఎక్కువగా ట్రెండ్ అవుతాయి. ఇదే కారు పార్టీ విషయంలో జరిగింది. అందులోనూ సెంటిమెంట్ అంశాలు…. మనస్సులో ఏదో  ఒకరమైన అభిప్రాయాన్ని కలిగించే వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. చిన్నచిన్న పొరపాట్లు, మాట్లాడిన మాటలు… ఇవన్నీ కూడా తటస్థ ఓటర్లపై కొంత ప్రభావం  చూపించాయి. అందువల్ల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలోకి వరదలా వచ్చాయి. ఇవీ కొంత ప్రభావాన్ని చూపించాయి. అయినప్పటికీ  ఫలనా పార్టీకే చాన్స్ ఉందేమోనని చర్చ కూడా జరిగింది. ఒక  వీడియోకు మరో వీడియోకు మధ్య కాలంలోనే  ఓటర్ల అభిప్రాయాల్లో మార్పులు రావడం మొదలైంది. ఇదో స్టాక్ మార్కెట్లో ట్రెండ్.. అందుకే సర్వేల్లో కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఒక అభిప్రాయంతో ఉన్న వారు మరునాటికి మారుతున్నారని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇది  ఓటర్ల ఆలోచనల్లో  వేగంగా వస్తున్న మార్పుకు ఉదాహరణ.

rr

ఇక రెండో అంశం:  ఉన్నవీ లేనివీ రకారకాల పేర్లతో సర్వేలు వచ్చాయి. జనాలు వాస్తవంగా ఏమనుకుంటున్నారో తెలియని పరిస్థితిని క్రియేట్ చేశాయి. దాంతో పాటుగా ఫలానా పార్టీకే కచ్చితంగా ఓటేయాలని అప్పటికే నిర్ణయించుకున్న  కొన్ని సెక్షన్ల ప్రజలున్నారు. వారిలో కొంత మంది అభిప్రాయాన్ని కొంత మేరకు ఈరకమైన సర్వేలు ప్రభావితం చేశాయి. అంతే కాదు, ఏది వాస్తవమో,  ఏది అవాస్తవమో  తెలియకుండా చేశాయి.

అన్నింటి కంటే.. అంతా సానుకూలంగానే ఉందనే ఉద్దేశంతో అధికార  పార్టీ క్షేత్రస్థాయి అంశాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయలేక పోయిందనే మాట వినిపిస్తోంది. ఒక్కోపార్టీ సర్వే ఒక్కో తీరులో ఉంది. కొన్ని సర్వేలు నియోజకవవర్గాలవారీగా ఉన్నాయి. కొన్ని సర్వేలు జిల్లాలవారీగా ఉన్నాయి. ఇంకొన్ని సర్వేలు కులాలవారీగా ఉన్నాయి. ఇలాంటి అరకొర సర్వేలు ఆయా సెక్షన్ల ప్రజల అభిప్రాయాలను గందరగోళ పర్చాయి.  ఫలనా పార్టీకి ఓటేస్తామని చెప్పే వారిని కూడా చివరి వారం వచ్చే వరకు చూద్దాం అనే స్థితికి నెట్టాయి.

tt

మూడో విషయం: ఇక చంద్రబాబు నాయుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రధాన స్రవంతి మీడియా..  కూటమికి చాలా హైప్ ఇచ్చింది. దానికి తోడు యాడ్స్ కూడా ప్రభావితం చేశాయి. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి, కూటమికి బలమైన నాయకుడు లేడు కదా అనుకున్నారు. కేసీఆర్‌ను తట్టుకునే నాయకుడు అటువైపు లేడు కాబట్టి ఏదోలా ఈ సారీ కారే అనే వారే సంఖ్య పెరిగింది. ఈ ప్రధాన స్రవంతి మీడియా చంద్రబాబుకు, కూటమికి హైప్ ఇవ్వడం, పెద్ద ఎత్తున సభలు పెట్టడం వల్ల కూటమి కూడా ఏదో చేస్తుందనే అభిప్రాయాన్ని కలిగించాయి.

వాస్తవానికి అప్పటి వరకు కూడా కూటమి ఏం చేసింది? సీట్ల పంపకం కూడా చేసుకోలేక పోయింది. ఇక ఇదేం చేస్తుందనే అభిప్రాయాన్ని జనాలకు కలిగించింది. కానీ మీడియాలో పతాక స్థాయి వార్తలు రావడం, కూటమి ఏదో చేస్తుందనే ప్రచారం ఇవన్నీ ఓటర్ల అభిప్రాయాన్ని కొంత వరకు ప్రభావితం చేశాయి.

ఈ మూడు అంశాల వల్ల తెలంగాణ ఎన్నికల్లో ఇంత టెంపో బిల్డప్ అయింది. కూటమి లేకుండా,  కాంగ్రెస్ పార్టీ సొంతంగా బరిలోకి దిగి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో చెప్పలేం. కాకపోతే చంద్రబాబు వల్లనే హైప్ వచ్చిందని అనుకోవడానికి వీలు లేదు. మునుపెన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీ, మోడీ, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేయడం కూడా ఈ ఎన్నికలు ఇంత ఉత్కంఠ కలిగించాయి.