రెడ్‌మీ 5ఎ ఇప్పుడు రూ. 3,999కే - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీ 5ఎ ఇప్పుడు రూ. 3,999కే

December 1, 2017

షియోమీ రెడ్‌మీ 5ఎ పేరిట మరో మొబైల్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మొబైల్ ధర తొలుత రూ. 5,999 లకు ప్రకటించింది. తొలి 50 లక్షల మంది కష్టమర్లకు వెయ్యి రూపాయలు తగ్గిస్తూ రూ. 4,999 కే ఇస్తామని ప్రకటించింది.

తాజాగా రెడ్‌మీ, జియో ఒప్పందం సఫలం అయిన క్రమంలో ఈ మొబైల్‌ను రూ. 3,999 కే ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు క్యాష్‌బ్యాక్ రూపంలో రానున్నదని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం జియో వినియోగిస్తేనే వర్తిస్తుంది.

ప్రతినెలా రూ.199 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే రూ. 1000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ప్యాక్‌పై అపరిమిత కాల్స్, 1జీబీ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. అయితే తొలి రీఛార్జ్‌ను డిసెంబర్ 5 నుంచి 2018, నవంబర్ 30 లోగా చేసుకోవాల్సి వుంటుంది.

ఈ ఆఫర్ కింద రూ. 100 చొప్పున 10 వోచర్ల చొప్పున వినియోగదారుని ఖాతాలో జమ అవుతాయి. అలా జమా అయిన వోచర్లను రూ. 309తో గానీ, అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసినప్పుడు వినియోగించుకోవచ్చు. లేదా రూ. 201 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్ కోసం వినియోగించుకోవచ్చు. 30 నవంబర్ 2019 వరకు ఈ వోచర్లు చెల్లుబాటు అవుతాయి.  2జీబీ, 16జీబీ వేరియంట్ గల రెడ్‌మీ 5ఎ మరో వేరియంట్‌లో 3జీబీ, 32 జీబీ ఫోను‌ను రూ. 6,999 గా అందిస్తున్నది. ఈ ఫోన్ ఈనెల 5 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నది.