mictv telugu

అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 7 వచ్చేస్తుంది

January 14, 2019

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ‌’ సరికొత్త రెడ్‌మి నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రేపటి నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌కు చెందిన 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర భారతీయ కరెన్సీలో రూ.10,300 ధ‌ర‌కు ల‌భిస్తుండగా… 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,400 ధ‌ర‌కు.. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,500 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో కూడా విడుదల కానుంది.

Telugu News Redmi Note 7 With 48-Megapixel Camera .

రెడ్‌‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు:

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

* 1080 x 2340 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

* 2.2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌

* ఆండ్రాయిడ్ 9.0 పై

* 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌

* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

* 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రేర్ కెమెరాలు

* 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

* ఫింగర్ ప్రింట్

Telugu News Redmi Note 7 With 48-Megapixel Camera, 4,000mAh Battery Announced: Price, Specifications