కోటికి చేరువలో రేలారే రేలారే పాట! - MicTv.in - Telugu News
mictv telugu

కోటికి చేరువలో రేలారే రేలారే పాట!

January 31, 2018

వెబ్ మీడియాలోకి అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తూ.. ‘రేలారే రేలారే’ అంటూ ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సం’ సందర్భంగా మైక్‌టీవీ మీ ముందుకు తెచ్చిన పాట కోటీకి చేరువలో ఉంది. మైక్‌టీవీ పాటల శిఖరంలో పునాది ఈపాట.

పల్లెమట్టి వాసనను, స్వచ్ఛమైన మనుషుల గొప్పతనాన్ని, తెలంగాణ కమ్మదనాన్ని  ఈపాటలో పొందుపరిచి మీముందుంచాం. పాటలో ఉన్న  స్వచ్చత  కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా రాష్ట్రాలలోనే కాకుండా.. చివరకు సముద్రాలను దాటి అమెరికా వంటి దేశాలలో కూడా మారుమ్రోగింది. కోటికి చేరువలో ఉన్న సందర్భంగా ఆపాటలో ఉన్న మాధుర్యాన్ని మరోసారి మీతో పంచుకుంటున్నాం. మాపై ఇంతగా ఆదరణ చూపిస్తున్న మీఅందరికీ మరోసారి ధన్యవాదాలు చెబుతోంది మీ మైక్‌టీవీ టీమ్