కూతురినే పెళ్లి చేసుకుని, బిడ్డను కని, చంపేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

కూతురినే పెళ్లి చేసుకుని, బిడ్డను కని, చంపేసి..

April 14, 2018

మనుషులు ఎటు పోతున్నారు ? నాగరికత వైపు పయనిస్తున్నారా .. లేకపోతే అనాగరికంలోకి వెళ్తున్నారా?  అలాంటి ఓ అనాగరిక ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది. స్టీవెన్ ప్లాదల్‌‌కు (42) అతని భార్యకు ఎప్పుడో విడాకులు అయ్యాయి. తన కూతురు క్యాటీని చిన్నతనంలోనే న్యూయార్క్‌కు చెందిన అంటోని ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చాడు. క్యాటీ వయసు ఇప్పుడు 20 ఏళ్ళు. అయితే గత కొంత కాలంగా స్టీవెన్  కూతురితోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి కూడా చేసుకుని గత ఏడాది సెప్టెంబర్ లో కొడుకును కూడా కన్నాడు.

పెంపుడు తండ్రికి ఈ విషయం తెలిసింది. ఫాదల్, క్యాటీ బంధానికి అడ్డు చెప్పాడు. దీంతో క్యాటీ స్టీవెన్‌కు బ్రేకప్ చెప్పింది. క్యాటీ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవటం వల్లే తనను వదిలిపెట్టిందని అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి ఈ విషయమై కూతురిని నిలదీశాడు స్టీవెన్. అలాంటిదేం లేదని క్యాటీ చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం ముదిరింది.

క్షణికావేశంలో పసికందును చంపేశాడు స్టీవెన్. ఆ తర్వాత క్యాటీని, ఆమె పెంపుడు తండ్రి ఆంటోనీని ఓ ట్రక్కులో కొంత దూరం తీసుకువెళ్ళి కాల్చి చంపేశాడు. అక్కడినుంచి పారిపోయి తననుతాను కాల్చుకుని చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు తన తల్లికి పూర్తి సమాచారం ఇచ్చాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. న్యూమిల్‌ఫోర్డ్‌ సమీపంలోని ఓ ట్రక్కులో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. లిట్చ్‌ఫీల్డ్‌ కౌంటీలో స్టీవెన్‌ మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. అక్రమ సంబంధాలు ఎప్పుడూ మరణాన్నే శాసిస్తాయి.. వీళ్ళ బంధం వికృతానికి పరాకాష్ట అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.