సాఫ్ట్‌వేర్ కంటే డ్రైవరే నయం - MicTv.in - Telugu News
mictv telugu

సాఫ్ట్‌వేర్ కంటే డ్రైవరే నయం

October 31, 2017

ముఖేశ్ అంబానీ  కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే  ఆశ్చర్యపోవాల్సిందే. ముఖేశ్ తన  డ్రైవర్‌కు ప్రతి నెల రూ 2 లక్షలు  జీతంగా ఇస్తున్నారు.

 కానీ అంబానీ డ్రైవర్‌గా ఎంపిక కావడం అంటే మాములు విషయం కాదు.  అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ డ్రైవింగ్  ఎజెన్సీని సంప్రదిస్తారు. కొందరు డ్రైవర్లును ఎంపిక చేసి వారికి కఠిన  శిక్షణలు ఇస్తారు . అన్ని  పరీక్షల్లో  విజయం సాధించి, సుదీర్ఘ శిక్షణ పొందిన వ్యక్తినే అంబానికి  డ్రైవర్ గా  నియమిస్తారు.  ఎంపికైన  డ్రైవర్‌కు, జీతంతో పాటుగా భోజనం నివాసం ఇతర సదుపాయాలు కల్పిస్తారు.  నటుడు సల్మాన్ కూడా తన బాడీగార్డు షెరాకు నెలకు  రూ. 15 లక్షల జీతం ఇస్తున్నాడు.