జియో ధన్‌ ధనా ధన్ ఆఫర్….!

టెలికాం సంస్థ జియో మరో భారీ ఆఫర్‌ను ప్రకటించింది.  ఇప్పటికే తక్కువ ధరకే డేటాను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.  తాజాగా దీపావళి పండుగ సందర్బంగా మరో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ‘ధన్ ధనా ధన్ ’ఆఫర్ పేరుతో  రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే 100శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ  ఆఫర్ అక్టోబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్యాష్ బ్యాక్ వోచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్  చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు .రూ. 399 ఆఫర్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లకు 84జీబీ డేటాతో పాటు ఉచిత ఎస్ఎంఎస్ , ఉచిత కాలింగ్ అందిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 84 రోజులు. తాజాగా దీపావళి ‘ధన్ ధనాధన్’ ఆఫర్‌లో కస్టమర్లు  రూ.399 రీఛార్జ్ చేసుకుంటే వారికి రూ.50 విలువగల 8 వోచర్లు వస్తాయి. అంటే మెుత్తం రూ.400 వస్తుంది. ఈ వోచర్లు మళ్లీ రీఛార్జ్  చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. నవంబర్ 15 తర్వాత ఈ వోచర్లు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఏదైనా జియో ఆఫర్ ఉంటే అది ముగిసిన తరువాత ఈ ప్లాన్ వర్తిస్తుంది.

SHARE