ఆర్‌‌కామ్ 2జీ సేవలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్‌‌కామ్ 2జీ సేవలు బంద్

October 26, 2017

రిలయన్స్ కమ్యూనికేషన్స్ ( ఆర్‌‌కామ్) సేవలకు అంతరాయం కలగనుంది. ఈ సంస్థ తన  2జీ సేవలను నెలరోజుల్లో నిపిలివేయనుంది. 3జీ, 4జీ సేవలను మాత్రం లాభాదాయకంగా ఉన్నంతవరుకు  అందిస్తామని  తెలిపింది.

 ఎయిర్‌సెల్‌తో  రిలయన్స్ చేసుకున్న విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు యూజర్లకు, తన  ఉద్యోగులకు  కంపెనీ సమాచారాన్ని అందించింది. వైర్‌లైస్ 2జీ సేవలను 30 రోజుల్లో నిలిపివేస్తామని తెలిపింది. అయితే తమకు  లాభంగా ఉన్న ఐఎల్‌ డీ వాయిస్, కన్య్టూమర్ వాయిస్, 4జీ డాంగిల్ పోస్ట్‌పెయిడ్ సేవలు మెుబైల్ టవర్ల వ్యాపారాన్ని కొనసాగిస్తామని తెలిపింది. నవంబర్ 21 నాటికి లైసెన్స్ ముగిశాక డీ‌టీ‌హెచ్  వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్టు కంపెనీ  తెలిపింది. ఆర్ కామ్ తలపై రూ. 46 వేల కోట్లు అప్పులు ఉన్నాయి.