జియో  బుకింగ్స్ మళ్లి షూరు... - MicTv.in - Telugu News
mictv telugu

జియో  బుకింగ్స్ మళ్లి షూరు…

November 28, 2017

టెలికాం రంగంలో అధిక పోటిని ఇచ్చిన జియో. తన  రిలియన్స్ జియో ఫీచర్ ఫోన్ విక్రయాలను మళ్లి ప్రారంభించింది. ఓ లింక్‌లో కూడిన మెసేజ్‌ను జియో కస్టమర్లకు పంపుతుంది. ఎవరైతే ముందుగా జియో ఫీచర్ ఫోన్‌ను నమోదుచేసుకున్నారో వారికే ఈ వివరాలను జియో పంపిస్తోంది. ఈ లింక్  ఓ కోడ్‌ను కల్గింటుంది.

దాన్ని దగ్గరలో ఉన్న జియో అవుట్ లెట్‌లో చూపించి, జియోఫీచర్ ఫోన్‌ను పొందాచ్చు. తొలిదశ అమ్మకాలలో భాగంగా రిలయన్స్ జియో 60 లక్షల జియో ఫోన్లను విక్రయించింది. రెండో దశలో 10 మిలియన్ల వినియోగదారులను  చేరుకోవాలని కంపెనీ నిర్ణయించింది.

జియో ఫీచర్ ఫోన్ ను ఈ ఏడాది జూలైలోనే ప్రారంభించింది. ఆగస్టులో కంపెనీ ఫ్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఫ్రీ-ఆర్డర్లకు వినియోగదారుల నుంచి  మంచి స్పందన వచ్చింది. మెుదట రూ.1500 చెల్లించి, జియో ఫీచర్ ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది.

3 ఏళ్ల తరువాత ఆ మెుత్తాన్ని కంపెనీ రీఫండ్  చేయనుంది. వాయిస్ అసిస్టెంట్ లాంటి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు జియో ఆఫర్ చేస్తుంది. 2.4 అంగుళాల 2.4 డిస్ ప్లే, సంగిల్ సిమ్ ఫోన్ , మైక్రోఎస్డీ కార్డు స్లాటు, ఎఫ్ఎం, రేడియో, 2 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా, 0.3  మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ  స్టోరేజ్ , 128 ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ .