పవన్ ఫ్యాన్స్‌పై  ఫైర్ అయిన రేణూ దేశాయ్! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఫ్యాన్స్‌పై  ఫైర్ అయిన రేణూ దేశాయ్!

March 3, 2018

తాజాగా రేణు దేశాయ్  పవన్ కళ్యాన్ ఫ్యాన్స్‌పై  మండిపడింది. ‘ఎందుకు అనవసరంగా నా పర్సనల్ సోషల్ మీడియాలోకి వచ్చి నన్ను కామెంట్ చేస్తున్నారు.  నేనేదో నా పాటికి సోషల్ మీడియాలో కవితలు రాసుకుంటే  అది పవన్ కళ్యాణ్ కు టార్గెట్  ఎలా అవుతుంది? నాకు తెలుసు ఈ ట్వీట్ ను  కూడా మీరు రాద్దాంతం చేస్తారని. మీ పని మీరు చూసుకోండి’ అని కొంచెం గట్టిగానే  సమాధానం ఇచ్చింది.పవన్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన జీవితం ఏదో తను బ్రతుకుతోంది. అయితే అప్పుడప్పుడు ఆమె  సోషల్ మీడియాలో కవితలు పెడుతోంది.  అవి నచ్చని పవన్ ఫ్యాన్స్‌లో కొందరు రేణు దేశాయ్ కి ట్వీట్ పెట్టారు. ‘మీ  కారణంగానే పవణ్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. సంగం నాలెడ్జ్ తో మీరు ట్వీట్లు చేస్తారు.  దాన్ని మీడియా హైలైట్ చేస్తుందని’ ట్వీట్ చేశారు. దీనితో ఆమె  పై విధంగా స్పందించారు.

https://twitter.com/renuudesai/status/969834593137430533