నెటిజన్‌పై రేణు దేశాయ్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

నెటిజన్‌పై రేణు దేశాయ్ ఆగ్రహం

October 26, 2017

మాటీవీ చానళ్లో  ప్రసారమవుతున్న ‘నీతోనే డాన్స్’ షోకు రేణే దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  నిజ జీవిత భాగస్వాములే ఈ షోలో డాన్స్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే ఈ షో మీద ఇటీవల చరణ్ అనే ఒక నెటిజన్ చాలా వెటకారంగా కామెంట్ చేశాడు. ‘ఈ షోలో డాన్స్ చేస్తున్నవాళ్ళను అసలు చూడలేకపోతున్నాం.

వాళ్ళు ఎంచక్కా సీరియళ్ళు చేసుకుంటే మంచిది కదా. వాళ్ళెవరూ ప్రొఫేషనల్ డాన్సర్లు కారు’ అని ట్వీట్ చేశాడు. రేణు అతనికి చాలా ఆగ్రహంగా రీట్వీట్ చేసింది. ‘ఈ షో కేవలం ఎంటర్‌టైన్‌మెంటు కోసమే. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇది సీరియస్ డాన్స్ కాంపిటీషన్ అస్సలు కాదు. ఇది రియల్ లైఫ్ జంటలతో చేస్తున్న షో మాత్రమే’ అని రీ ట్వీట్ చేశారు.