రేణూ దేశాయ్ కవితావేదన.. అభిమానుల కంటతడి - MicTv.in - Telugu News
mictv telugu

రేణూ దేశాయ్ కవితావేదన.. అభిమానుల కంటతడి

February 23, 2018

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ట్విటర్ ద్వారా తన కవితలను పరిచయం చేస్తూనే ఉంటుంది. తాజాగా తన జ్ఞాప‌కాల‌ని క‌విత రూపంలో  వీడియోను షేర్ చేసింది రేణూ. ఆ కవిత తన అభిమానుల గుండెను పిండెస్తోంది. ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో ఉన్న ఓ వీడియోను ఆమె ట్విటర్ ద్వారా రిలీజ్ చేసింది.

‘‘మనసు పొరల్లో సమాధైన  జ్ఞాపకాలు

వాటిని మళ్లీ మళ్ళీ చూసుకుంటునక్నాను

ఆయన మాటలు, పదాలు,పేరు నా మదిలో చెరిగిపోని రాతలే

ఇప్పటికీ అవన్నీ నా మనసు పొరల్లో జ్ఞాపకాలే

క‌మ్ముకున్న మంచు క‌రిగిపోయి

ఇంకోసారి క‌ళ్ళముందుకొచ్చాయి.

విధి ఎంత బ‌లీయమైన‌ది?

మ‌న‌సులో ఎక్కడో పాతుకుపోయిన

జ్ఞాప‌కాల‌ను మ‌ళ్ళీ ఎందుకు త‌ట్టి లేపుతుంది?

వాటిని మ‌ళ్ళీ చూసుకుంటే

ఓ తుప్పు ప‌ట్టిన క‌లం, దానితో రాసుకున్న పేరు

ముక్క‌లైన నా హృద‌యం,

నేను రాసుకున్న లేఖ‌ల కాగిత‌పు ముక్క‌లే కనిపించాయి’’

అంటూ బరువెక్కిన గుండెతో తన ఆవేద‌న‌ను, త‌న జ్ఞాప‌కాల‌ని క‌విత ద్వారా  రేణూ తెలిపింది. వీటిని చదివిన అభిమానులు.. కన్నీళ్లు పెట్టుకుంటున్నామని స్పందిస్తున్నారు. మ‌ల్టీ టాలెంట్ ఉన్న రేణూ త‌న హాబీగా క‌విత‌లు కూడా రాస్తుంటారు. వాటికి పుస్త‌క రూపం ఇవ్వాల‌ని తాను భావిస్తున్నట్టు గ‌తంలోనే తెలిపారు. త‌ను ఇంగ్లిష్‌లో రాసుకున్న క‌విత‌ల‌ను తెలుగులోకి అనువాదం చేసేందుకు ప్ర‌సాద మూర్తితో జ‌ట్టు క‌ట్టారు. ఇటీవ‌ల‌ రేణూ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఇంగ్లీష్‌లో ఒమేగా, తెలుగులో ‘కారుమ‌బ్బుల కాంతి మండలం’ అనే పేరుతో ఉన్న చిన్న‌ క‌విత‌ని పోస్ట్ చేశారు. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.