ఆడపిల్లలుగా పుట్టడమే వారి తప్పా.. రేణూ దేశాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లలుగా పుట్టడమే వారి తప్పా.. రేణూ దేశాయ్

April 17, 2018

నటి,దర్శకురాలు రేణూ దేశాయ్ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై స్పందించింది. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.ఇలాంటి ఘటనలను చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు  చేసిన పాపం అనిపిస్తోంది. అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకుచ్చే కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొంది.‘ఆసిఫా, నిర్భయ, ఉన్నావ్.. వీళ్లందరూ వివిధ వయసులకు చెందిన వారు, కులాల రిత్యాగానీ.. ప్రాంతాల రిత్యాగానీ.. వీరికి ఎటువంటి సంబంధం లేదు. కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బాధితులంతా ఆడపిల్లలే. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలను చేపట్టాలని ప్రముఖ లాయర్లను, ఓ ప్రముఖ సామాజిక సేవా కార్యకర్తను, ఒక పోలీసు ఉన్నతాధికారిని కోరగా.. ‘ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పటిదాకా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ర్యాలీలు నిర్వహించినా ఎటువంటి ఉపయోగం ఉండదని’ ముక్త కంఠంతో చెప్పారు.

ఆడపిల్లలు, పసిపిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలు నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సోషల్ మీడియాలో, అనేక చర్చా వేదికల్లో, రోడ్లపై ర్యాలీల రూపంలో మన నిరసనను తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు ఆగట్లేదు. ఈ చర్యలకు పాల్పడే రాక్షసుల్లో ఎటువంటి మార్పూ రావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ హృదయ విదారక ఘటనలకు చరమగీతం పడుతుంది. అప్పటి వరకూ మన ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే కన్న తండ్రే తన కూతుళ్లను రేప్ చేసిన చరిత్ర మనకుంది. అందుకే మన ఆడపిల్లలకు తగిన రక్షణ కల్పిస్తూ మనం భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది రేణు.

ఆసిఫా, నిర్భయ , ఉన్నావ్ … వీళ్ళందరూ వివిధ వయసులకు చెందిన వారు. కులాల రీత్యా గాని ప్రాంతాల రీత్యా గాని వీరికి ఎటువంటి…

Posted by Renu Desai on Monday, 16 April 2018