రిజర్వేషన్లు శక్తి సామర్థ్యాలను తగ్గిస్తాయి.. జగ్గీ వాసుదేవ్ - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్లు శక్తి సామర్థ్యాలను తగ్గిస్తాయి.. జగ్గీ వాసుదేవ్

November 27, 2017

లింగబేధం ఆధారంగా రిజర్వేషన్లు సరికాదన్నారు సద్గురు జగ్గీవాసుదేవ్. రిజర్వేషన్లు శక్తి సామర్థ్యాలను తగ్గిస్తాయని కితాబిచ్చారు. హైదరాబాద్‌ ది పార్క్ హోటల్‌లో ‘ లీడర్‌షిప్ ఎంపవర్‌మెంట్ ఇన్ ఉమెన్ ’ పేరుతో నిర్వహించిన సదస్సులో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో పాటు ఎంపీ కవిత పాల్గొన్నారు.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌పై ఆయన వైఖరి కోరిన నిజామాబాద్ ఎంపీ కవితకు జగ్గీ వాసుదేవ్ సమాధామిచ్చారు. ‘ ఎన్నికల్లో ఆడ, మగ ప్రతిపాదికన రిజర్వేషన్లు పెట్టొద్దని.. రిజర్వేషన్ల వల్ల ప్రతీ ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.. ఈ కులాల ప్రతిపాదికన దేశంలో రిజర్వేషన్లు అమలు చేయటం సబబు కాదు.

కుటుంబాలలోకి మార్కెట్ ఆలోచలను తీసుకురావద్దు. గ్రామీణ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు కట్టాలి. ప్రజాస్వామ్యంలో మనుషులను కులాలు, మతాల లెక్కన జమకట్టొద్దు. లింగ బేధం లేనప్పుడే సమాజం గొప్పగా తయారవుతుంది. అయితే గత 20 ఏళ్లలో మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చింది.. ఇంకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది ’ అని అభిప్రాయపడ్డారు జగ్గీ వాసుదేవ్.