సీతక్క నిర్ణయానికి  రేవంత్ భార్యే కారణమా? - MicTv.in - Telugu News
mictv telugu

సీతక్క నిర్ణయానికి  రేవంత్ భార్యే కారణమా?

November 1, 2017

సీతక్క టీడీపీని వీడడం వెనక అసలు కారణం ఏంటి ? ఇందులో రేవంత్ రెడ్డి భార్యకు సంబంధం ఏంటి ? రాయాబారాలు ఎలా జరిగాయి ? సీతక్క  తెలుగుదేశం పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక పెద్ద హైడ్రామానే నడిచిందని పలువురు అనుకుంటున్నారు. సీతక్క కాంగ్రెస్‌లో చేరడానికి  రేవంత్ రెడ్డి భార్య హస్తం ఎంతో ఉందట.

రేవంత్ భార్య  నేరుగా హన్మకొండకు వెళ్లి  సీతక్కను కలిసి, కాంగ్రెస్‌లో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చిందని, దీనితో  రాత్రికి రాత్రే సీతక్క తన మనసు మార్చుకుందని సమాచారం.  టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇదే జరిగిందా అన్న అనుమానం అందరిలోను కలుగుతుంది.‘  రేవంత్ భార్య సోమవారం రాత్రి, సీతక్క ఇంటికి వెళ్లి బతిమాలి, ఆమె కాళ్లను పట్టుకున్నారంటూ’ దయాకర్ రావ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో సీతక్క ఇమడలేరని, త్వరలోనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని జోస్యం చెప్పారు.