హైదరాబాద్ పోలీసులకు వర్మ టోపీ.. అరెస్ట్ తప్పదా? - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ పోలీసులకు వర్మ టోపీ.. అరెస్ట్ తప్పదా?

February 8, 2018

రాంగోపాల్ వర్మ అరెస్ట్ కాబోతున్నాడా? జీఎస్టీ సినిమాతో వర్మకు చిక్కులు వచ్చిపడ్డాయా? ఏమో మరి పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది. వివాదాల వర్మ తీసిన జీఎస్టీ సినిమాపై  కొన్ని రోజుల క్రితం మహిళలు తీవ్ర ఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే  ఓ టీవీ లైవ్ లో కూర్చొని వర్మ కొందరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సామాజిక కార్యకర్త దేవీ సీసీ ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణకు హాజరుకావాలంటూ  హైదరాబాద్ పోలీసులు వర్మకు నోటీసులు పంపారు.  వర్మ గురువారం  సీసీఎస్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది.  కానీ రాలేదు.

తాను నాగార్జునతో చేస్తున్న సినిమా షూటింగ్ ముంబైలోె జరుగుతుంది  అందుకే  విచారణకు హాజరు కాలేనంటూ వర్మ తన లాయర్‌తో  పోలీసులకు  సమాచారం అందించాడు. వచ్చేవారం  మళ్లీ నోటీసులు పంపించండి. అప్పుడు  విచారణకు హాజరు  అవుతాను అని వర్మ తేల్చి చెప్పాడు. వర్మ కోరినట్టు  వచ్చేవారం  మళ్లీ నోటీసులు పంపుతామని, అప్పుడు కూడా వర్మ  విచారణకు హాజరు కావకపోతే  అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు  ఉన్నట్లు  సమాచారం.