mictv telugu

నగ్నంగా పనిచేస్తే గంటకు రూ.4 వేలు..

February 12, 2019

కస్టమర్ల మనసెరిగి నడచుకోవడం, ఎప్పటికప్పుడు కొత్తరకం వస్తుసేవలను పరిచయం చేసి మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకోవడం వ్యాపారంలో కీలకం. ఎవరో ఏదో అనుకుంటారని వెనకంజ వేస్తే వెనకనే వుండిపోతారు. ఆ కంపెనీ కూడా అలాగే భావించి ముందుకు దూసుకెళ్లింది. కస్టమర్లకు నగ్నంగా పనిచేసే మనుషులను సరఫరా చేస్తోంది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ముట్టజెబుతోంది. అన్నీ చాలా సహజంగా సాగిపోవాలనే సిద్ధాంతంతో దీనికి తెరలేపింది ఆ కంపెనీ.

Telugu news Rise of the naked cleaner Meet the home helps who tidy your home in the 

బ్రిటన్‌లోని నేచరిస్ట్ క్లీనర్ అనే కంపెనీ ఈ ఘనమైన సేవలు అందజేస్తోంది. పాత్రలు కడగడం, ఇస్త్రీ చేయడం, ఇల్లు తుడవడం, వంటావార్పూ వంటి పనులను ఒంటిపై నూలుపోగు లేకుండా పూర్తి చేసే మనుషులను అద్దెకిస్తోంది. వారికి గంటకు రూ. 4 వేలు చెల్లిస్తోంది. ముఖ్యంగా ఒంటిపీనుగ మగ కస్టమర్లు వారిని అద్దెకు తీసుకుంటున్నారు. నగ్నంగా ఉన్నారు కదా అని అడ్వాంటేజీ తీసుకుని అతి చేస్తే మాత్రం కంపెనీ సదరు కస్టమర్లపై చర్యలు తీసుకుని, కోర్టుకు కూడా లాగుతుంది. ఇప్పటికే పలువురు ఆడామగలు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. బట్టలు వేసుకుని పనిచేసే వారిని కూడా కంపెనీ తీసుకుంటోందిగాని వారికి గంటకు రూ. 2200 మాత్రమే చెల్లిస్తోంది. నగ్నంగా పని చేయడానికి నగ్నంగా పనిచేసే సాహసం ఉంటే చాలు. ఎలాంటి ముందస్తు అనుభవమూ అక్కర్లేదు. లావుగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఎలా ఉన్నా అర్హులేనంటూ కంపెనీ తన వెబ్ సైటులో పేర్కొంటూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Telugu news Rise of the naked cleaner Meet the home helps who tidy your home in the