జర్నలిస్టులు ఫ్రీగా మందుకొట్టే బాపతు - MicTv.in - Telugu News
mictv telugu

జర్నలిస్టులు ఫ్రీగా మందుకొట్టే బాపతు

December 15, 2017

బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఢిల్లీలో జర్నలిస్టులపై నోరుపారేసుకున్నాడు.  ఫ్రీగా మందు తాగే బాపతు అంటూ ముగ్గురు జర్నలిస్టులపై కామెంట్ చేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిషీకపూర్  తన తండ్రి రాజ్ కపూర్ పై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించాడు.

ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసినవారు ఈ కార్యక్రమానికి జర్నలిస్టులను కూడా ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమంలో ఓ ముగ్గురు వ్యక్తులు రిషీ కపూర్ వచ్చే దారిలో కనపడ్డారు. వెంటనే వారిని రిషీ కపూర్ మీరెవరు?  అని ప్రశ్నించాడు.

దానికి వారు మీడియా వాళ్లం సార్ అని సమాధానం చెప్పారు. వెంటనే రిషీకపూర్ ఫ్రీగా మందు తాగే బాపతు అంటూ హిందీలో గొనుక్కుంటూ అక్కడినుండి  వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిషి కపూర్‌కు చెందిన సెక్యూరిటీ వచ్చి మీరు ఇక్కడ ఉండటం సార్‌కి ఇష్టం లేదంటూ మీడియా వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు. మీడియా వాళ్లను ఇంత చులకనగా చూడడం ఏంటని  రిషీ కపూర్ పై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామీడియావాళ్లే పబ్లిసిటీ చెయ్యకపోతే మీరు స్టార్లుగా ఎలా ఎదుగుతారు సార్ అంటూ మండిపడ్డారు.