60 నదుల సయ్యాట - MicTv.in - Telugu News
mictv telugu

60 నదుల సయ్యాట

September 1, 2017

ఏటా భారీ ఎత్తున సముద్రం పాలవుతున్న వరదనీటిని సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించడానికి కేంద్ర భారీ కసరత్తు మొదలు పెట్టింది. రూ. 5.5 లక్షల కోట్లతో నదులను అనుసంధానం చేసి, నీటికి ఎక్కడికక్కడ ఒడిసిపట్టాలని ప్రణాళిక రచిస్తోంది.

ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ పథకం కింద 60 నదులను అనుసంధానం చేస్తారు. వీటిలో ఉత్తరాది సాగుకు వెన్నెముకలాంటి గంగానది కూడా ఉంది. నదుల అనుంధానంతో వరదనీటి వృథాను అరికట్టొచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. రుతుపవనాలను నమ్ముకోకుండా.. ఉన్న నీటిని సమర్థంగా వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే పక్క ప్రణాళికతో వరద నష్టాన్ని భారీగా తగ్గించాలనేది కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ప్రవహిస్తున్న కర్ణావతి నదిపై డ్యామ్ ను నిర్మించి తక్కువ నీరున్న బేట్వా నదిలోకి మళ్లించడం ఈ ప్రాజెక్టు పనుల్లో ఒకటి. తద్వారా కర్ణావతి నీరు సముద్రం పాలు కాకుండా అరికొట్టొచ్చు.