మోదీ ఎద్దు, స్మృతి ఆవు, యోగి దూడ.. అజిత్

రాజకీయ విమర్శలు హద్దులు మీరుతున్నాయి. తిట్టుకోవడంలో పార్టీల నేతలు పోటీ పడుతున్నారు.  రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలను ఆయన జంతువులతో పోల్చారు.Telugu news RLD chief Ajit Singh Compares PM Modi With Bull, Yogi With Calfఅజిత్ నిన్న యూపీలోని  కోసీకలాన్లో రైతులతో ముచ్చటిస్తూ రాజకీయాలపై రైతులకు తెలిసిన నానుళ్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత. మనం తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నాం. అయితే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ఉండడం ప్రజాస్వామ్య  గొప్పతనమే. మీ ఎద్దులు, ఆవులు, దూడలు ఇటీవల  విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తల్లో చూశాను. మీరు వాటిని మీరు పాఠశాల్లో, కళాశాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ అని, యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిసిన ఆవు ఒకటి వచ్చిందని  అంటున్నారు. మన స్మృతీ ఇరానీ కూడా ఇటీవల బాగా తిరుగుతున్నారు అని అజిత్ సింగ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.