పాము కాని పాము..ప్రాణాలు కాపాడే  పాము ! - MicTv.in - Telugu News
mictv telugu

పాము కాని పాము..ప్రాణాలు కాపాడే  పాము !

March 3, 2018

పాములు తమ విషంతో మనుష్యుల ప్రాణాలు తీస్తాయని మనకు తెలుసు. కానీ ఈ పాము మాత్రం  ప్రాణాలను కాపాడుతుంది.  మనుష్యులు దూరని  ప్రాంతాల్లోకి  పాక్కుంటూ వెళ్లి మరీ  తనవంతు సహాయం చేస్తుంది. ఇంతకీ ఇదేం పాము అనుకుంటున్నారా? రోొబో పాము.  రోబో మనిషిని చూసాం, రోబో  వస్తువులను కూడా  చాలా చూశాం కదా. ఇక రోబో పామును తయారు చేశారు. హర్వర్డ్‌ జాన్‌పాల్సన్‌ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లైడ్ సైన్స్‌ పరిశోధకులు.

ఈ రోబో పాము వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తోంది. జపాన్‌కు చెందిన కిరిగామి అనే పేపర్‌క్రాఫ్ట్‌ను  ఈ రోబో పాముకోసం వాడారు. దీని ప్రకారం కాగితాన్ని భిన్న ఆకృతుల్లో కత్తిరిస్తారు. రోబో కదలికల ప్రకారం పైన చుట్టి ఉన్న కాగితం పాము చర్మంలా కనిపిస్తుంది. మనుషులు దూరని ప్రదేశాలలో కూడా ఈ రోబో పాములు వెళ్లి  సహాయక చర్యలు చేపడతాయని పరిశోధకులు తెలిపారు.