రోబో2.0 ట్రైలర్ లీకైంది ! - MicTv.in - Telugu News
mictv telugu

రోబో2.0 ట్రైలర్ లీకైంది !

March 7, 2018

8 ఏళ్ల క్రితం వచ్చిన రజనీకాంత్ రోబో సినిమా ఎంత సెన్సేషనల్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తోన్న 2.0 కు  శంకర్ తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. మొన్ననే మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే 2.0 టీజర్ అంటూ య్యూట్యూబ్‌లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.


ఈ టీజర్ కొంచెం క్లారిటీగా లేకపోయినా రోబో సినిమాకు రెట్టింపుగా 2.0 ఉండబోతోందనేది స్పష్టమవుతోంది. స్క్రీన్ పైన టీజర్ ప్లే అవుతుంటే ఎవరో వీడియో తీసి లీక్ చేసినట్లు తెలుస్తోంది.  రజినీ కాంత్ నటించిన కాలా సినిమా విడుదలకు ఉండడంతో 2.0 రిలీజ్ కు కొంచెం సమయం పట్టనున్నట్లు సమాచారం.