శ్రీకాంత్ కొడుకు సిద్ధమవుతున్నాడు... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాంత్ కొడుకు సిద్ధమవుతున్నాడు…

October 26, 2017

నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించిన శ్రీకాంత్ తనయుడు రోహన్ మళ్ళీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ విషయమై రోహన్ నాన్న శ్రీకాంత్ స్పందించాడు. ‘ రోహన్ ప్రస్తుతం అమెరికాలో వున్నాడు.

 

యాక్టింగ్‌లో మరిన్ని మెళకువలు నేర్చుకోవడానికి అక్కడ ఒక యాక్టింగ్ స్కూల్లో చేరాడు. మరో మూడేళ్ళ తర్వాతే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు ’ అని తెలిపాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ రారా’ సినిమా నవంబర్ 17 న విడుదల కానున్నదని తెలిపాడు. అలాగే మలయాళంలో మోహన్ లాల్‌తో కలిసి నటించిన సినిమా శుక్రవారం నాడు విడుదల అవుతుందని చెప్పాడు. కన్నడలో కూడా ఓ సినిమాలో నటిస్తున్నట్టు, మరో రెండు సినిమాల షూటింగులు ప్రారంభమవనున్నాయని చెప్పాడు.