రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్..

December 13, 2017

క్రికెటర్ రోహిత్ పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా మూడు డబల్ సెంచురీలతో అదరగొట్టాడు. మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్ల మీద సిక్సర్లతో చెలరేగిపోయాడు.

ఆరంభం నుండి రోహిత్ దూకుడు చూపిస్తూ డబుల్ సెంచరీ పూర్తి చేసాడు. 50 ఓవర్లలో భారత్ 392 పరుగులు చేసింది. రోహిత్ ఒక్కడే 151 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. మొత్తం 208 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి  క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

భర్త ఆటతీరు చూసి రోహిత్ భార్య ఆనందబాష్పాలు రాల్చింది. తమ తొలి పెళ్లి కానుకగా రోహిత్ తన భార్యకు ఈ విజయాన్ని కానుకగా ఇచ్చాడు.  గతంలోనే రోహిత్‌శర్మ రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.  ధోని 7, పాండ్యా 8,  ధావన్ 68 , అయ్యర్ 88 పరుగులతో సరిపెట్టారు.