దంచి కొట్టిన రోహిత్..35 బంతుల్లో సెంచరీ - MicTv.in - Telugu News
mictv telugu

దంచి కొట్టిన రోహిత్..35 బంతుల్లో సెంచరీ

December 22, 2017

ఇండోర్ లో శ్రీలంకతో జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో రోహిత్ దూకుడుని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్ల తో మెరుపు  సెంచరీని చేశాడు. రోహిత్ కొట్టుడుకు స్టేడియంలో అంతా రోహిత్ రోహిత్ అంటూ నినాదాలతో అభిమానులు గట్టిగా అరిచారు. ఈసెంచరీతో అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. మొత్తం 10 సిక్సులు,12 ఫోర్లతో 118 పరుగులు చేసిన రోహిత్  చమీరా వేసిన 12.4వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి  ఔటయ్యాడు.