ఓ అభిమాని కోరికనట ఇది! - MicTv.in - Telugu News
mictv telugu

ఓ అభిమాని కోరికనట ఇది!

December 13, 2017

అభిమానులు తమ అభిమానాన్ని ఏవిధంగా చూపిస్తారో తెలీదు?కొందరు.. మాటల్లో తమ అభిమానాన్ని చూపిస్తే, ఇంకొందరు చేతల్లో చూపిస్తుంటారు. మొహాలీలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు. దీనితో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు.

తమ అభిమాన క్రికెటర్ పై  ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ అభిమానాన్ని చూపెట్టారు. ఓ అభిమాని అయితే రోహిత్ ఫొటోతో భారత ప్రభుత్వం 200 రూపాయల నోట్లు ముద్రించాలని ఇలా మార్ఫింగ్ చేసి ఫోటో పెట్టాడు. ఇంకో అభిమాని ‘పెళ్లిరోజున భార్య రితికకు రోహిత్‌ మర్చిపోలేని బహుమతి ఇచ్చాడని’ అన్నారు. ఇలా సోషల్ మీడియాలో రోహిత్ శర్మను పొగుడుతూ అందరూ  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.