mictv telugu

జయహో రోహిత్.. ఒక మ్యాచ్‌లో 2 ప్రపంచ రికార్డులు

February 8, 2019

టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. టీ-20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ ఆటగాడు గుప్టిల్ పేరుపైన ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. రోహిత్ శర్మ 2288 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా గుప్టిల్ 2277, పాకిస్తానీ ఆటగాడు షోయబ్ మాలిక్ 2263 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 2167 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.Telugu News Rohit Sharma overtakes Martin Guptill to become highest run-getter in T20Isఅదే సమయంలో రోహిత్‌ మరొక రికార్డును నెలకొల‍్పడం విశేషం. అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్‌లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా రోహిత్‌ మరో రికార్డు సాధించాడు. ఈరోజు చేసిన హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ శర్మ యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని 20 సార్లు సాధించాడు. దాంతో విరాట్ కోహ్లి (19 సార్లు) రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో రోహిత్‌ అర్థ శతకం సాధించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు టీంఇండియా విజయం సాధించి 1-1 తో సిరీస్ సమం చేసింది.